Home / Movie News / Varun Tej to have Hollywood Based Action-Composers in Ghani Movie

Varun Tej to have Hollywood Based Action-Composers in Ghani Movie

మెగా హీరో వరుణ్‌తేజ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ ఓ బాక్సింగ్‌ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలైంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అదేంటంటే.. సినిమాలో కీలకమైన బాక్సింగ్‌ ఎపిసోడ్‌ కోసం ప్రముఖ హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్‌ వ్లాడ్‌ రింబర్‌ పనిచేయనున్నారట. ఆ ఫైట్‌ సన్నివేశాన్ని భారీ స్టేడియంలో చిత్రీకరించనున్నారు. వరుణ్‌ సరసన బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, సునీల్‌శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పిస్తుండగా, రెనైసెన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ ప్రముఖ బాక్సర్‌ టోనీ జెఫ్రీస్‌ దగ్గర ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

NTR 98th Birth Anniversary

Bala Krishna Pays Tribute to NTR on 98th Birth Anniversary l NTR Ghat

యుగపురుషుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ , నటరత్న , పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక ...

Watch Dragon ball super