Home / Gossips / Pawan Kalyan Hari Hara Veera Mallu Teaser Releasing Date is fixed?
Pawan Kalyan Hari Hara Veera Mallu

Pawan Kalyan Hari Hara Veera Mallu Teaser Releasing Date is fixed?

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. అయితే సినిమాకి సంబంధించి టీజర్‌ని పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్‌ 2న విడుదల చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అదే విధంగా కథానాయిక నిధి అగర్వాల్‌కు సంబంధించి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 17న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సైతం విడుదల చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ‘హరిహరి వీరమల్లు’కు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంది. సినిమా షూటింగ్‌ ప్రారంభమై పదిహేను రోజులు షూటింగ్‌ కూడా జరుపుకొంది. తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

చిత్రానికి ‘ఆక్వామన్’, ‘వార్‌క్రాఫ్ట్’, ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు గ్రాఫిక్ పనులు పర్యవేక్షించిన బెన్ లాక్ ఈ సినిమాకి VFX బాధ్యతలను చూస్తున్నారు. మొఘలులు, కుతుబ్ షాహిల నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. బాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ శ్యామ్‌ కౌశల్‌ నేతృత్యంలో ఆ మధ్య పవన్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. అర్జున్‌ రాంపాల్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండజ్‌, ఆదిత్య మేనన్‌ తదితరలు నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక గీతంలో నటించనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

BALA KRISHNA NANDAMURI to act with SHRUTHI HASSAN

బాల కృష్ణ నందమూరి శ్రుతి హసన్‌తో కలిసి నటించబోతున్నారా? బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ...

Watch Dragon ball super