యువ కథానాయకుడు నాని పలు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అరిస్తుంటారు. ప్రస్తుతం ఆయన ‘శ్యామ్ సింగరాయ్’ చేస్తున్నారు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ ఇప్పటికే పూర్తయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే ఆయన మరో చిత్రానినికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కబోయే ఈ సినిమాలో నాని ఫుట్బాల్ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు కూడా విన్నాడట. అయితే దీనికి గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రటకన రానుందని సమాచారం. గతంలో నాని క్రీడా నేపథ్యంలో ‘భీమిలి కబడ్డిజట్టు’ చేశారు. ఇక 2019లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంగా ‘జెర్సీ’లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు.

nani-as-a-football-player