Home / Movie News / Major Movie Release Postponed due to Covid Pandamic
major-release-postponed-due-to-pandamic

Major Movie Release Postponed due to Covid Pandamic

‘మేజర్‌’ మామూలుగా ఉండదు’ అని అంటున్నారు నటుడు అడివిశేష్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మేజర్‌’. ముంబయి ఉగ్రదాడిలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం మొదట భావించింది. ఈ మేరకు అప్పట్లో ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

కాగా, తాజాగా కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘మేజర్‌’ రిలీజ్‌ వాయిదా వేస్తున్నట్లు అడివి శేష్‌ ప్రకటించారు. పరిస్థితులన్ని చక్కబడిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతిఒక్కరూ సురక్షితంగా ఇంటిపట్టునే ఉండాలని ఆయన సూచించారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్‌ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

NTR 98th Birth Anniversary

Bala Krishna Pays Tribute to NTR on 98th Birth Anniversary l NTR Ghat

యుగపురుషుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ , నటరత్న , పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక ...

Watch Dragon ball super