Home / Actors / Legend, Man of Masses To Host UNSTOPPABLE with NBK on AHA
Featured Video Play Icon
unstoppable with nbk

Legend, Man of Masses To Host UNSTOPPABLE with NBK on AHA

లెజెండ్, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తెలుగువారి ఫేవరెట్ డిజిటల్ OTT ప్లాట్​ఫామ్​ ‘ఆహా’లో ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అనే ప్రొగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
ఈ టాక్​ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. దీపావళి ఫెస్టివల్ కానుకగా నవంబరు 4న ఈ ప్రొగ్రాం ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. త్వరలో ఈ షోకు టాలీవుడ్ బడా స్టార్స్, టెక్నిషియన్స్ రానున్నట్లు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలియచేసారు.
ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుందని… అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుందని బాలయ్య చెప్పారు. ‘ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్‌’. ఆ కాన్సెప్ట్‌ నాకు నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా’ అని నందమూరి బాలకృష్ణ గారు ప్రారంభోత్సవ సభలో అన్నారు.
బాలకృష్ణ తొలిసారిగా ఓటిటి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న మొట్టమొదటి టాక్ షోకు సంబంధించిన వీడియో ప్రోమో తాఈ సందర్భంగా విడుదల చేసారు . ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ కోసం బాలయ్య బాబు గారు చేస్తున్న ఈ టాక్ షో ప్రోమో చూస్తోంటే… బాలయ్య బాబు అప్‌కమింగ్ సినిమా ట్రైలర్ చూసినంత స్టైలిష్‌గా ఉంది. అన్‌స్టాపబుల్ అంటూ బ్యాగ్రౌండ్లో ఆర్ఆర్ వస్తుండగా… స్క్రీన్ పై బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఎంట్రీ, అప్పీయరెన్స్ ఈ టాక్ షోపై అంచనాలు పెంచేశాయి.
ఈ సంద‌ర్భంగా నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ వెండితెరపై నటుడేమో కానీ, నిజ జీవితంలో కాదు. భావోద్వేగాలను దాచుకోరు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’ చేయడం నిజంగా ఆనందంగా ఉంది అని అన్నారు .

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Grand Pre-Release Event OF Akhanda on 27th Nov 21 as Chief Guest Icon Star Allu Arjun

Grand Pre-Release Event OF Akhanda Starring Nandamuri Natasimha Balakrishna Garu is going ...

Watch Dragon ball super