యుగపురుషుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ , నటరత్న , పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 98 వ జన్మదినాన్ని పురస్ఖరించుకొని తనయుడు నందమూరి బాల కృష్ణ గారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు .
ఈ సందర్భం గా నందమూరి బాల కృష్ణ గారు మాట్లాడుతూ తండ్రి ఎన్టీఆర్ తనకు మంచి స్ఫూర్తి అని , నందమూరి తారక రామారావు గారి జీవితం సారాంశాన్ని పాట్యంసం గా చేర్పించాలి అని , స్వయంగా తానే తండ్రి గారి మీద పుస్తకాన్ని రచించాలనుకుంటున్న అని తెలియచేసారు .
వ్యక్తి స్థాయిని దాటి మహాశక్తిగా ఎదిగిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు-మహానాయకుడు… ఎన్టీఆర్ .
వెండితెర వేల్పుగా అశేష ఆంధ్రావళి నీరాజనాలు అందుకున్న ఎన్టీఆర్ జీవ న ప్రస్థానం నవతరానికి స్ఫూర్తి మంత్రం అని బాల కృష్ణ గారు అన్నారు .
తండ్రి ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్ఖరించుకొని బాల కృష్ణ గారు స్వయం గా పాడిన శ్రీ రామ దండకం పాటను విడుదల చేసారు.
బాల కృష్ణ గారు పాడిన శ్రీ రామ దండకం పాటకు ప్రేక్షకుల నుండి అశేషమైన ఆదరణ లభిస్తుంది.