Home / Gossips / Anchor Rashmi to act in Nagarjuna Film

Anchor Rashmi to act in Nagarjuna Film

తెలుగునాట రష్మి గౌతమ్‌ బుల్లితెరపై యాంకర్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఈటీవీలో ప్రసారమవుతున్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అలరిస్తుంటుంది. తాజాగా ఆమె నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రం గోవాలో తన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ కూడా మొదలు కానుంది. ఇందులో కథానాయికగా కాజల్‌ అగర్వాల్  నటిస్తోంది. సినిమాను శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మి గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’లో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు అవకాశం లభించిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. రష్మి హిందీ, తమిళ, కన్నడంలోనూ నటించింది. 

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Pawan Kalyan Hari Hara Veera Mallu Teaser Releasing Date is fixed?

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం ...

Watch Dragon ball super